బయటకొస్తే నాతో యమలోకానికి తీసుకెళ్తా

బయటకొస్తే నాతో యమలోకానికి తీసుకెళ్తా

బహ్రయిచ్ : యూపీలో లాక్ డౌన్ టైమ్ లో బయటకు వస్తే తనతో తీసుకెళ్తానని యమధర్మరాజు హెచ్చరించారు. “నేను యమధర్మరాజును. కరోనా వైరస్ ను. మీరు రూల్స్ పాటించకుంటే భూమి పై ఒక్క మనిషి మిగలకుండా చేస్తాను. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తప్పకుండా నాతో పైకి తీసుకెళ్తాను ” అంటూ బహ్రయిచ్ టౌన్ లో ఇల్లు తిరుగుతూ యమరాజు వార్నింగ్ ఇచ్చాడు. యమధర్మరాజు యూపీలో తిరగటం ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా లాక్ డౌన్ టైమ్ జనం కేర్ లెస్ ఉండకుండా అవగాహన పెంచేందుకు పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం. లవ్ కుశ్ మిశ్రా అనే ఓ పోలీస్ యమధర్మరాజు వేషాధారణతో ఇంటికి వెళ్లి వారికి కరోనా గురించి అవగాహన కల్పించారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని అనవసరంగా బయటకు రావద్దంటూ సూచించారు. లాక్ డౌన్ ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు వెరైటీ ప్రచారం చేశామని పోలీసులు చెప్పారు. ఐనా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటింటికి అవగాహన కల్పించేందుకు వెళ్లిన యమరాజు తో  ఫోటోలు, సెల్ఫీ లు దిగటానికి జనం గుమిగూడారు.