RR vs CSK : దంచికొట్టిన రాజస్థాన్.. చెన్నైకి భారీ టార్గె్ట్

RR vs CSK : దంచికొట్టిన రాజస్థాన్.. చెన్నైకి భారీ టార్గె్ట్

జైపూర్ వేదికపై చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా సిక్సర్లు ఫోర్లు బాదుతూ చెన్నై బౌలర్లను చితకొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (77, 43 బంతుల్లో) చెన్నై బౌలర్లపై చెలరేగాడు. పవర్ ప్లేలో టాప్ ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు చేయడానికి సహరకించాడు. జాస్ బట్లర్ (27, 21 బంతుల్లో) పవర్ ప్లేలో పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 

తర్వాత వచ్చిన బ్యా్ట్స్ మెన్ దృవ్ జురెల్ (34, 15 బంతుల్లో), పడిక్కల్ (27, 13 బంతుల్లో) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దాంతో రాజస్థాన్ 200 పరుగుల మైలు రాయిని దాటింది. కెప్టెన్ సంజూ శాంసన్ (17, 17 బంతుల్లో) చెప్పుగోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. హెట్ మేయర్ (8, 10 బంతుల్లో) మళ్లీ విఫలం అయ్యాడు. చెన్నై బౌలర్లలో తీక్షన, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. తుషార్ దేశ్ పాండే కు రెండు వికెట్లు దక్కాయి.