యశ్ ‘టాక్సిక్‌‌‌‌’ షూటింగ్ అప్డేట్.. బెంగళూరులో ఫైనల్ షెడ్యూల్

యశ్ ‘టాక్సిక్‌‌‌‌’ షూటింగ్ అప్డేట్.. బెంగళూరులో ఫైనల్ షెడ్యూల్

‘కేజీయఫ్‌‌‌‌’ ఫ్రాంచైజీతో పాన్‌‌‌‌ ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్‌‌‌‌’ చిత్రంలో  నటిస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కీలక షెడ్యూల్‌‌‌‌ను రీసెంట్‌‌గా ముంబైలో  పూర్తి చేశారు. 45రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌‌‌‌లో  హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె.పెర్రీ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ను చిత్రీకరించారు.  త్వరలోనే ఫైనల్ షెడ్యూల్‌‌‌‌ను బెంగళూరులో స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ అప్‌‌‌‌డేట్ ఇచ్చారు. ఈ షెడ్యూల్‌‌‌‌తో దాదాపు టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలియజేశారు.

ఇందులో నయనతార, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతైరా హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. కానీ ఇప్పటివరకు హీరోయిన్స్‌‌‌‌ గురించి ఎలాంటి ప్రకటన టీమ్ నుంచి రాలేదు.  కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్‌‌‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కన్నడ,  ఇంగ్లీష్‌‌‌‌  భాషల్లో తెరకెక్కిస్తున్నారు.  మార్చి 19న  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  సినిమా విడుదల కానుంది.  ఈమూవీపై ఇప్పటికే  అంచనాలు ఏర్పడ్డాయి.