YASH : రామాయణ కోసం .. హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌‌‌‌తో యశ్

YASH : రామాయణ కోసం .. హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌‌‌‌తో యశ్

‘కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో పాన్‌‌‌‌‌‌‌‌ఇండియా స్టార్‌‌‌‌‌‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో హీరోగా  నటిస్తున్నాడు.  మరోవైపు ప్రెస్టిజీయస్  హిందీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ‘రామాయణం’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రణబీర్ కపూర్,  సాయిపల్లవి జంటగా రూపొందుతున్న  ఈ చిత్రంలో రావణుడిగా యశ్ కనిపించబోతున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో  రెండు భాగాలుగా  తెరకెక్కుతోన్న  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ల కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నారిస్‌‌‌‌‌‌‌‌తో చేతులు కలిపాడు యశ్. 

మ్యాడ్ మాక్స్  లాంటి హాలీవుడ్ హిట్స్‌‌‌‌‌‌‌‌లో స్టంట్స్ డిజైన్ చేసిన గై నారిస్, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరింత థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతున్నాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు రావణుడి పాత్రకు కొత్త  డైమెన్షన్‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సన్నివేశాలను ముంబైలోని ఓ భారీ సెట్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా సెట్‌‌‌‌‌‌‌‌ నుంచి విడుదల చేసిన మూవీ స్టిల్స్‌‌‌‌‌‌‌‌లో యశ్ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కనిపిస్తున్నాడు.  ఇందులో  సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే కుంభకర్ణుడిగా నటిస్తున్నారు. ఈ మైథలాజికల్ చిత్రాన్ని  నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా, యశ్ కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. పార్ట్‌‌‌‌‌‌‌‌ 1ను  వచ్చే దీపావళికి, పార్ట్‌‌‌‌‌‌‌‌ 2ను 2027 దీపావళికి  రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే  ప్రకటించారు.