‘సెరి బెల్లార్ ట్యామర్’ నుంచి వ్యక్తిని కాపాడిన ‘ మలక్ పేట యశోదా హాస్పిటల్’ డాక్టర్లు

‘సెరి బెల్లార్ ట్యామర్’  నుంచి వ్యక్తిని కాపాడిన ‘ మలక్ పేట యశోదా హాస్పిటల్’ డాక్టర్లు

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:  మలక్ పేట యశోదా హస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల నేతృత్వంలోని వైద్య బృందం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాత్లావత్ హరిలాల్ అనే యువకుడికి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి పునర్జన్మ ప్రసాదించారు. మెదడులోని సెరిబెల్లార్ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత క్లిష్టమైన ట్యూమర్  కారణంగా తీవ్ర నరాల సమస్యలతో బాధపడుతున్న బాధితుడికి డాక్టర్లు సబ్ ఆక్సిపిటల్ క్లానియోటమీ ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి ఆ గడ్డను విజయవంతంగా తొలగించారు. 

శనివారం మహబూబ్ నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ తరహా గడ్డలు ప్రాణాంతకమని, సరైన సమయంలో చికిత్స అందడం వల్లే రోగి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడని వివరించారు. శస్త్రచికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకున్న హరిలాల్‌ను తగిన వైద్య సూచనలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.