యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్’ సదస్సు

 యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  ‘లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్’ సదస్సు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘ లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్’ పేరుతో శని, ఆదివారం రెండ్రోజుల పాటు  బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో అంతర్జాతీయ జాయింట్ రీప్లేస్ మెంట్ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఆదివారం జరిగిన సెమినార్ ను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థరైటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రారంభదశలోనే కీళ్లను కాపాడుకోవడం వల్ల ఆర్థరైటిస్ ను నివారించవచ్చన్నారు. 

యశోద హాస్పిటల్స్ ఎండీ జీఎస్ రావు మాట్లాడుతూ.. అత్యాధునిక రోబోటిక్, లాపరోస్కోపిక్, ఓపెన్ టెక్నిక్ ద్వారా ఆర్థోపెడిక్ సర్జరీలను విజయవంతంగా ఎలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన 500 మందికి పైగా యువ సర్జన్లకు లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ద్వారా వివరించామన్నారు. ఇక్కడి ఆపరేటింగ్ సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 మంది ప్రముఖ అంతర్జాతీయ జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ రెండ్రోజుల సదస్సు, లైవ్ వర్క్ షాప్ ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీ ప్లేస్ మెంట్ సర్జన్ డాక్టర్ నితిన్ కుమార్, యశోద హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు.