డిసెంబర్ 9 నుంచి సమంత 'యశోద'స్ట్రీమింగ్

డిసెంబర్ 9 నుంచి సమంత 'యశోద'స్ట్రీమింగ్

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఓటీటీ లో రిలీజ్ కు డేట్ కన్ఫర్మ్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హరి- హరీశ్ దర్శకద్వయంలో వచ్చిన ఈ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ గా సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు. అయితే ఈ సినిమా డిజిటల్ తెరపైనా సందడి చేయనున్నట్టు ప్రైమ్ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఆన్ లైన్ లో డిసెంబర్ 9 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు వెల్లడించింది. 

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీంతో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ రానుండడంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.