‘యశోద’లో లంగ్ క్యాన్సర్ చికిత్సపై వర్క్​షాప్

‘యశోద’లో లంగ్ క్యాన్సర్ చికిత్సపై వర్క్​షాప్

హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్​లో ఆదివారం ఈబీయూఎస్(ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్) లంగ్ క్యాన్సర్లకు సంబంధించిన చికిత్సపై శిక్షణ సదస్సు, లైవ్ వర్క్ షాప్ నిర్వహించారు. యశోదలోని పల్మొనాలజీ విభాగం ‘ఇబస్ మాస్టర్ క్లాస్’​ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రధాన పల్మనాలజిస్టులకు ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు పాల్గొని మాట్లాడారు. 

పల్మనాలజిస్టులు ఇబస్ గురించి, లంగ్ క్యాన్సర్ చికిత్సలో అధునాతన చికిత్సా విధానాలను తెలుసుకున్నారన్నారు. పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ వి.నాగార్జున మాటూరు మాట్లాడుతూ.. దేశంలో పురుషుల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సర్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ప్రతి లక్ష మందిలో సుమారు 30 మంది ఈ వ్యాధి బారిపడుతున్నారన్నారు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులను వీలైనంత వేగంగా గుర్తించేందుకు ఇబస్ తో పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జపాన్ ‌‌‌‌కు చెందిన డాక్టర్ యుజి మట్సుమోటో, థాయ్‌‌‌‌లాండ్ నేషనల్ క్యాన్సర్ సెంటర్‌‌‌‌కు చెందిన డాక్టర్ తితివాట్ శ్రీప్రసారత్ పాల్గొని మాట్లాడారు.