కర్రలతో కొట్టుకున్న రెండు వర్గాలు.. భారీగా పోలీసుల మోహరింపు

కర్రలతో కొట్టుకున్న రెండు వర్గాలు.. భారీగా పోలీసుల మోహరింపు

నంద్యాల జిల్లా డోన్ మండంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లంలపల్లిలో శ్రీరాముడి ఆలయం దగ్గర    వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది.  రెండు పార్టీల కార్యకర్తలు   కర్రలతో కొట్టుకున్నారు.  ఘర్షణలో పోలీసులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లంపల్లిలో పోలీసులు భారీగా మెహరించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేయడంతో గొడవ సద్గుమణిగింది.  మరోసారి గొడవ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్న పోలీసులు  ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.