వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమించిన తర్వాత ఆయన మాట్లాడారు.  కూల్చివేతలతో పాలనను ప్రారంభించిన YCP…  భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చివేసిందన్నారు. ప్రస్తుతం రైతులను కూల్చేస్తోందని, ఇంతమందిని కూల్చేస్తున్న ఈ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందన్నారు.

అంతేకాదు తాను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు..సిమెంట్ ఫ్యాక్టరీలూ పెట్టలేదు, కాంట్రాక్టులు చేయనంటూ అధికార పక్ష నేతలపై విమర్శలు చేశారు పవన్. తనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమేనని, ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమాలను ఆదరించారని, నచ్చకపోతే పక్కనబెట్టారని చెప్పారు. అందరికీ సెలవులుంటాయి కానీ రైతుకు మాత్రం ఉండవని అంటూ సీఎం జగన్ గురించి మాట్లాడారు. మన జగన్ రెడ్డి గారికి శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులుంటాయి కానీ రైతుకు సెలవు లేదన్నారు.