తెలంగాణ వాళ్లకు ఏపీలో రాజ్యసభ సీట్ల వెనక మతలబేంది?

తెలంగాణ వాళ్లకు ఏపీలో రాజ్యసభ సీట్ల వెనక మతలబేంది?

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో రెండింటిని తెలంగాణ వారికే కేటాయించటం వెనుక ఏపీ సీఎం జగన్​ వ్యూహమేమిటనే చర్చ ఆసక్తి రేపుతున్నది. తెలంగాణ వాసులైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్యతో పాటు అడ్వకేట్​ నిరంజన్​రెడ్డికి ఏపీ కోటాలో అవకాశమివ్వటం కొత్త సమీకరణాలకు తెర లేపింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువే మిగిలి ఉంది. ఈ టైమ్ లో జగన్​ తీసుకున్న నిర్ణయం ఆ ఎన్నికల్లో ఎవరికి మేలు చేస్తుందనే చర్చ జరుగుతున్నది. 

హైదరాబాద్, వెలుగు: ఏపీ కోటా నుంచి ఇద్దరు తెలంగాణ వాళ్లను రాజ్యసభకు పంపాలని వైఎస్​ జగన్​ తీసుకున్న నిర్ణయం వెనుక మతలబేంది? ఆయన వ్యూహం ఏమిటి? అని ఇరు రాష్ట్రాల లీడర్లు ఆరా తీస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని బరిలోకి దింపాలన్న ఆలోచనలో భాగంగానే జగన్​ ఇలాంటి ప్లాన్​ వేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వల్ల ప్రతిపక్ష ఓట్లను, బీసీ ఓట్లను చీల్చి.. అధికార టీఆర్​ఎస్​కు మేలు చేసే ఎత్తుగడ దాగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టీఆర్​ఎస్​, వైసీపీ మధ్య ఉన్న అవగాహనలో ఇది భాగం అయి ఉంటుందని వారు అంటున్నారు. తెలంగాణకు చెందిన ఆర్​.కృష్ణయ్య, నిరంతెలంగాణ వాళ్లకు ఏపీలో రాజ్యసభ సీట్లు..జన్​రెడ్డిని ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేస్తూ మంగళవారం జగన్​ నిర్ణయం తీసుకున్నారు.  అయితే, ఏపీలో బీసీ కులాల ఓటర్లను చేరదీసే దూరదృష్టితోనే బీసీ కోటా నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశమిచ్చినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. 

కానీ, ఏపీలో బీసీ లీడర్లు లేరా.. ? తెలంగాణకు చెందిన బీసీ లీడర్​తో ఏపీలో ఎంత మేరకు ప్రభావం ఉంటుందనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. జగన్​ తీసుకున్న నిర్ణయంపై ఏపీలో ఇతర పార్టీల నేతలతోపాటు అక్కడి బీసీ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాజ్యసభకు సమర్థులైన అభ్యర్థులెవరూ ఆంధ్రప్రదేశ్​లో  లేరా..? అని టీడీపీ చీఫ్​ చంద్రబాబు ప్రశ్నించారు. నిరంజన్​రెడ్డి నిజానికి జగన్​ కేసులను వాదిస్తున్న అడ్వకేట్​. ముందునుంచి తన వెంట ఉండటంతో పాటు కష్ట సమయంలో సాయం చేసినందుకే నిరంజన్​కు చాన్స్​ దక్కిందని, తనకు అండగా ఉన్న వారిని జగన్​ కాపాడుకుంటారనే ఇండికేషన్​ ఇచ్చినట్లయిందని వైసీపీ లీడర్లు అంటున్నారు. తనకున్న సమీకరణాలతో వ్యూహాత్మకంగానే తెలంగాణకు చెందిన ఇద్దరికి జగన్​ కీలక అవకాశాలు కల్పించినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. రాజకీయ సమీకరణాలతో వ్యూహాత్మకంగానే 
తెలంగాణకు చెందిన ఇద్దరికి జగన్​ కీలక అవకాశం కల్పించినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. 

తెలంగాణపై జగన్​ ఫోకస్​ పెట్టారని, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని తెలంగాణకు విస్తరించే ఆలోచన లేకపోలేదనే ఊహాగానాలు  వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జగన్​ సోదరి వైఎస్​ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్​టీపీ ఏర్పాటు చేసి పాదయాత్రలు, వరుస ఆందోళనలతో జనంలో ఉంటున్నారు.  వైఎస్ అభిమానులు, ఉమ్మడి రాష్ట్రంలోని వైసీపీ లీడర్లు షర్మిల వెంట నడుస్తున్నారు. ఈ టైమ్​లో జగన్​ తెలంగాణలో ఎంట్రీ ఇస్తారా?  అనేది అన్ని పార్టీలకు సందేహంగా మారింది.  ఆర్​.కృష్ణయ్య సొంత జిల్లా వికారాబాద్​. అడ్వకేట్​ నిరంజన్​రెడ్డి సొంత జిల్లా నిర్మల్​. వీరిద్దరూ తెలంగాణలో ప్రభావం చూపించే లీడర్లు తప్ప ఏపీ రాజకీయాల్లో వీరి ప్రభావం ఉండదనే అభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కొన్ని స్థానాలకైనా పోటీ చేసి, ప్రతిపక్ష ఓట్లను, కృష్ణయ్య ప్రభావంతో బీసీ ఓట్లను చీల్చగలిగితే అది టీఆర్ఎస్​కు ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరు సీఎంలకు ఉన్న రాజకీయ సఖ్యత దృష్ట్యా ఇలాంటి వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఏపీలో బీసీ ఓట్లే లక్ష్యమా?
ఏపీలో 49% బీసీల ఓటు బ్యాంకు​ ఉంది. ముందు నుంచీ టీడీపీకి బీసీల్లో పట్టుంది. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీకి జగన్​ షాక్​ ఇచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ, జ‌‌న‌‌సేన పొత్తు కుదుర్చుకుంటాయనే ప్రచారం జరుగుతున్నది. కాపులు అటువైపు మొగ్గు చూపినా..  మిగతా బీసీల‌‌ను త‌‌న వైపు నిలుపుకునే ఎత్తుగడతోనే జగన్​ రాజ్యసభ సీట్ల కోటాలో  ఆర్‌‌.కృష్ణయ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. కృష్ణయ్య ఉమ్మడి ఏపీలోనే  బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి.. దాదాపు 30 ఏండ్లకుపైగా బీసీల తరఫున పోరాటం చేస్తున్నారు. 2014లో హైదరాబాద్​లోని ఎల్బీనగర్​ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణయ్య గత ఎన్నికల్లో జగన్‌‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్​ దగ్గర కృష్ణయ్యకు ఉన్న గుర్తింపు, వైఎస్సార్​పై కృష్ణయ్యకు ఉన్న అభిమానంతోనే జగన్​ ఇప్పుడు ఆయనకు కీలక పదవి కట్టబెట్టినట్లు కూడా చర్చ జరుగుతున్నది. జగన్‌‌పై నమోదైన అక్రమాస్తుల కేసును అడ్వకేట్​ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌‌ తో ఆయనకు దోస్తానీ పెరిగింది. పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న నిరంజన్ రెడ్డి ఇటీవల టికెట్ ధరల పెంపు విషయంలోనూ జగన్‌‌తో చిరంజీవి భేటీ అయ్యేందుకు కీలకంగా వ్యవహరించినట్లు ఇండస్ట్రీలో టాక్​ ఉంది.