
వెలుగు, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, భరత్ నగర్, కాచిగూడ, నారాయణగూడ, మాసబ్‌ట్యాంక్, కోఠి, అబిడ్స్, బేగంపేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, నాంపల్లి, కూకట్ పల్లి, బాలానగర్, కాప్రా, బోరబండ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మాదాపూర్ లో1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల10 వరకు జంట నగరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.