
టెహ్రాన్: ఇండియా స్టార్ అథ్లెట్ యెర్రాజీ జ్యోతి.. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. తొలి రోజు శనివారం జరిగిన విమెన్స్ 60 మీటర్ల హర్డిల్స్‌లో తన నేషనల్ రికార్డును బద్దలుకొడుతూ 8.12 సెకండ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. షాట్‌పుట్‌లో తేజిందర్‌పాల్ సింగ్ తూర్ గుండును 19.72 మీటర్ల దూరం విసిరి నేషనల్ రికార్డు క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. విమెన్స్ 1500 మీటర్ల రన్‌లో హర్మిలన్ బైన్స్ 4:29.55 సెకండ్ల టైమింగ్‌తో బంగారు పతకం సొంతం చేసుకుంది.