మీ సొమ్ముకు నేను హామీ : నిర్మలా సీతారామన్

మీ సొమ్ముకు నేను హామీ : నిర్మలా సీతారామన్

ఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న తమ నగదు ను డ్రా చేసుకునేందుకు అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లకు, బ్యాంకులకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్ లలో ఉన్న నగదు సురక్షితంగా ఉంటుందని  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎస్ బ్యాంక్ ను గట్టెక్కించేలా ఆర్బీఐ గరవ్నర్  శక్తికాంత్ దాస్ తో చర్చించినట్లు తెలిపారు. అకౌంట్ హోల్డర్ల శ్రేయస్సే లక్ష్యంగా కేంద్రం, ఆర్బీఐ కలిసి పని చేస్తాయన్న సీతారామన్ ..తక్షణ కర్తవ్యంగా రూ.50వేల నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు.