
బోధన్, వెలుగు: పెండ్లయిన కొన్ని గంటలకే గుండెనొప్పితో పెండ్లికొడుకు చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నాయీ బ్రాహ్మణగల్లికి చెందిన చందూర్ గణేష్ పెండ్లి సాలూర గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం జరిగింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 వరకు కాలనీల్లో డీజేతో బారాత్ నిర్వహించారు. స్నేహితులు, బంధువులతో కలిసి పెండ్లికొడుకు డ్యాన్స్ చేశాడు. బారాత్ పూర్తయిన తర్వాత గణేష్ చాతిలో నొప్పి వస్తుందని చెప్పాడు. వెంటనే నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.