నాకు ప్రాణహాని ఉంది.. నన్ను కాపాడండి : హనీ సింగ్‌

నాకు ప్రాణహాని ఉంది.. నన్ను కాపాడండి : హనీ సింగ్‌

ప్రముఖ బాలీవుడ్ రాపర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యో యో హనీ సింగ్‌(Yo yo honey singh)  షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ప్రాణభయం ఉందంటూ ఢిల్లీ పోలీసులను(Dilly police) ఆశ్రయించాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. "కెనడాలో ఉంటున్నట్టు చెప్పబడుతున్న ఓ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్(Goldy brar) నుంచి తనను చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చాయని చెప్పినట్టు సమాచారం.

ఆ కాల్ వచ్చినప్పటి నుండి తనకు చాలా భయంగా ఉందని, తనకే కాదు తన స్టాఫ్ ఫోన్లకు కూడా కాల్స్, మెసెజ్‌లు వస్తున్నాయని, దీంతో తన కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోందని, ప్రతిరోజు భయం భయంగా గడుస్తోందని పోలీసులతో చెప్పాడని తెసులుస్తోంది". ఇక ఇదే విషయంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ ప్రారంభించినట్లు సమాచారం.