
భాగ్యనగరంలో యోగా డే సందడి మొదలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బేగంపేట చికోటీ గార్డెన్స్‌లోని యోగదా సత్సంగ సొసైటీ ధ్యాన కేంద్రంలో 70 మంది క్రియాయోగులు, వైఎస్‌ఎస్ భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. శక్తిపూరక వ్యాయామాలు, పరమహంస యోగానంద బోధనల పఠనం, ధ్యానం, భజనలతో సత్సంగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వైఎస్ఎస్, ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన ఆధ్యాత్మిక సాహిత్యానికి చెందిన పుస్తకాలను 50 శాతం డిస్కౌంట్ అమ్మకాలు జరిపారు. జులై 2వ తేదీ వరకూ ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.