అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్న మోడీ

అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్న మోడీ

మంచి ఆరోగ్యానికి... యోగా బాటలు వేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యోగాతో శాంతివస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారన్నారు. యోగాతో ప్రపంచానికి శాంతి లభిస్తుందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్ లో యోగా వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. యోగా మనల్ని బలవంతులుగా చేస్తుందన్నారు. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని మోడీ అన్నారు. 

75 చారిత్రక ప్రాంతాల్లో యోగా ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. యోగా డే ప్రపంచవ్యాప్తంగా పండుగలా మారిందని గుర్తు చేశారు. ఆరోగ్యం, శాంతి, సంతోషానికి సూచిక యోగా అని అన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ తో జనంతో కలిసి ప్రధాని యోగా చేశారు.  కొన్నేళ్ల క్రితం అయితే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, కానీ ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోడీ తెలిపారు. ప్రధానితో పాటుగా  కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్  బొమ్మై కూడా ఈ కార్యక్రమలో పాల్గోన్నారు.  

అటు యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. యోగా దినోత్సవం నిర్వహిస్తున్న ఆయుష్, సాంస్కృతిక శాఖలను అభినందించారు.  ప్రతీ ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డే లో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. తర్వాత పబ్లిక్ తో కలిసి వెంకయ్య ఆసనాలు వేశారు.