చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న యోగి

చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న యోగి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ.. జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాల్లో 264 సీట్లలో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యోగి మళ్లీ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 1985 నుంచి ఇప్పటివరకు యూపీలో ఏ సీఎం కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ములాయం సింగ్, కల్యాణ్​ సింగ్, మాయావతి, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్, అఖిలేశ్ యాదవ్ సీఎంలుగా పనిచేసినప్పటికీ తర్వాతి ఎన్నికల్లో వారి పార్టీలు గెలవలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న యోగి మాత్రం మరోమారు సర్కారు ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నారు. తద్వారా 37 ఏళ్లుగా లేని రికార్డును ఆయన సృష్టించే అవకాశం ఉంది. ఇకపోతే, తాను పోటీ చేసిన గోరఖ్ పూర్ లో యోగి ఆధిక్యంలో ఉన్నారు.