ఓం ప్రకాశ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి : యోగీ

ఓం ప్రకాశ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి : యోగీ

వెనకబడిన తరగతుల సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ రాజ్ బార్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలన్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వినతిని ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ ఆమోదించారు. ఈ మేరకు మంత్రి వర్గం నుంచి రాజ్ భార్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని స్వాగతించారు రాజ్ బార్.

ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. సోషల్ జస్టిస్ కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి..దాని నివేదికను మాత్రం బుట్టదాఖలు చేశారని విమర్శించారు. నివేదికను అమలు చేసే సమయం ముఖ్యమంత్రికి లేదంటూ విమర్శించారు. సోషల్ జస్టిస్ కమిటీ అందించే నివేదికను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు…