నువ్వే దేశాన్ని లూటీ చేసినవ్..మోదీపై రబ్రీదేవి సంచలన కామెంట్స్

నువ్వే దేశాన్ని లూటీ చేసినవ్..మోదీపై రబ్రీదేవి సంచలన కామెంట్స్

పాట్నా: దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లూటీ చేశారని బిహార్  మాజీ సీఎం, లాలూ ప్రసాద్  యాదవ్  భార్య రబ్రీదేవి విమర్శించారు. ఆర్జేడీ అధికారంలో ఉన్నపుడు రబ్రీ పెద్ద  కూతురు, పాటలీపుత్ర ఎంపీ మీసా భారతి పెండ్లి కోసం పలు షోరూంల నుంచి బ్రాండెడ్  వెహికల్స్ ను బలవంతంగా తీసుకెళ్లారని మోదీ చేసిన వ్యాఖ్యలపై రబ్రీదేవి స్పందించారు. ‘‘వాస్తవానికి మోదీనే దొంగ. ఆయననే ప్రజలు దొంగ అని పిలవాలి. ఎందుకంటే, దేశాన్ని మోదీ దోచుకున్నాడు” అని రబ్రీ పేర్కొన్నారు.