
న్యూఢిల్లీ: మెసెంజర్ యాప్ వాట్సాప్ ద్వారా ట్యాక్సీ బుక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని ఉబర్ ప్రకటించింది. ప్రస్తుతం లక్నో సిటీలో మాత్రమే వాట్సాప్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. అక్కడి కస్టమర్లు తమ ఫోన్‌లో ఉబర్ యాప్ లేకున్నా వాట్సాప్‌తోనే క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నంబరుకు మెసేజ్ పంపడం ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఉబర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. చాట్ మెసేజ్ పంపి కూడా వెహికల్‌ను రప్పించుకోవచ్చు. త్వరలో మిగతా సిటీలకూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఉబర్ పేర్కొంది.