
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దళితుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
దళితులకు ఇచ్చిన హమీలను బీఆర్ఎస్ ఎలా తుంగలో తొక్కింది, వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఎట్లా దారి మళ్లించిందనే దానిపై ఒకసారి ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. దళితులకు బీఆర్ఎస్ చేసిన ద్రోహం, వారిపై చేసిన దాడులు, విధ్వంసాన్ని జనం ఇంకా మరిచిపోలేదన్నారు.