పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన్రు: యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన్రు: యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంఐఎంది ఫెవికాల్ బంధమన్న యూపీ సీఎం

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ /ఆమనగల్లు, వెలుగు: ‘‘తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్పది. ఏండ్ల పాటు సాగింది. తొలి, మలి దశ ఉద్యమంలో ఎందరో ప్రాణ త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సాకారమైంది. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ ప్రజల కలలను నాశనం చేసింది”అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోందని ఆరోపించారు. ఇక్కడి అధికార పార్టీ లీడర్లు భూమి, ఇసుక, మట్టి మాఫియాలుగా పేర్లు తెచ్చుకున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాఫియా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట గొడవలు జరిగేవని, నెలల కొద్దీ కర్ఫ్యూ ఉండేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో యూపీలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చాక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టలేదని తెలిపారు. యూపీలో బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి అందరికి భయం పట్టుకుందని చెప్పారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మాఫియా ఉందని, దానిని తరిమేస్తామని హెచ్చరించారు.

ఉద్యోగాలు ఇవ్వడంలో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

తెలంగాణ యువత జీవితాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని యోగి ఆరోపించారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. యూపీలో ఆరేండ్లలో 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిలైందని మండిపడ్డారు.​ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలు జరిగి యువత భవిష్యత్ నాశనం అవుతున్నా ఇక్కడి ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కామన్ ఫ్రెండ్ ఎంఐఎం..

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకున్నారని, ఈ ఎన్నికల్లో వీరికి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని యోగి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీలకు కామన్ ఫ్రెండ్ ఎంఐఎం అని, ఈ రెండు పార్టీలకు ఎంఐఎంతో ఫెవికాల్ బంధం ఉందని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, వీరిలో ఎవరికి ఓట్లు వేసినా తెలంగాణతో పాటు ప్రజల గుర్తింపును నాశనం చేస్తాయని విమర్శించారు. ఇది నయా భారత్ అని హైవేలు, రైల్వేస్, వందే భారత్ రైళ్లు, ఎయిర్ పోర్టులు ఏర్పాటయ్యాయని తెలిపారు. హవాయి చెప్పులు వేసుకునే వాళ్లు కూడా విమానాలు ఎక్కుతున్నారని, ఈ ఘనత ప్రధాని మోదీదేనన్నారు. ఎయిమ్స్, ఐఐటీ, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లతో పాటు మరిన్ని స్కీంలు దేశంలో అమలవుతున్నాయని గుర్తుచేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి, కల్వకుర్తిలో ఆచారికి ఓట్లు వేసి గెలిపించడంతో పాటు అత్యధిక స్థానాల్లో తమ పార్టీ క్యాండిడేట్లను గెలిపించి, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయా సభల్లో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థులు ఏపీ మిథున్ రెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి, చిత్తరంజన్ దాస్, పాలమూరు సీడ్స్​ సుదర్శన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, పాండు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.