సీజ్ చేసిన బండి కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే..

సీజ్ చేసిన బండి కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే..

కరోనా లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి వస్తున్నవారి వెహికల్స్ ను సీజ్ చేస్తున్న పోలీసులు..లాక్ డౌన్ తర్వాత కోర్టు ఆదేశాలు వచ్చాకే రిలీజ్చేస్తామని చెబుతున్నారు. రూల్స్ ను ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టి , వెహికల్స్ వివరాలను కోర్టులకు ఇచ్చారు. ఓనర్లు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాకే ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. లక్షన్నరకు పైగా..లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. వారిలో అవసరం లేకున్నా రోడ్డెక్కు తున్న వారు, డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడులు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాలాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,192 కేసులుపెట్టారు. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 610 కేసులను వివిధ ఐపీసీ సెక్షన్ల కింద రిజిస్టర్చేశారు. రూల్స్ ను ఉల్లంఘించిన లక్షా 51వేల 170 వెహికల్స్ ను సీజ్ చేశారు. ఇందులో1,39,977 బైక్స్, 4,835 కార్లు, మిగతావి ఇతర వెహికల్స్ ఉన్నాయి. వీటిని స్థానిక కోర్టులకు సరెండర్ చేశారు.