యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు..

యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు..

తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది.  ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్‌పై 67 బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరు ప్రణీత్ అదుపులోకి తీసుకోగా.. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

ఈ నేపథ్యంలో.. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ప్రణీత్ ఏ1 కాగా... ఏ2గా డల్లాస్ నాగేశ్వర రావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా ఆదినారాయణను చేర్చారు. కాగా... ప్రణీత్ ను బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అనంతరం రహస్య ప్రాంతంలో విచారించారని తెలుస్తోంది. ఇతని తీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సీరియస్ గా తీసుకుంది. తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో చర్చ పెట్టిన ప్రణీత్ హనుమంతు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.. ఈ నేపథ్యంలో అతడితో పాటు ఆ కార్యక్రమంలో భాగస్వాములైన మరో ముగ్గురిపైనా సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో  పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

.