ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం..డిజిటల్పేమెంట్స్ కు జై అంటున్న యువత

ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం..డిజిటల్పేమెంట్స్ కు జై అంటున్న యువత
  • సూపర్ మనీ రిపోర్ట్​ వెల్లడి
  • తిండి కోసం ఎక్కువ ఖర్చు

యువత కొనుగోళ్లు ప్లాన్ ​ప్రకారం ఉంటున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఆన్‌‌లైన్ ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కిరాణా, సూపర్ మార్కెట్ కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో ఉదయం కిరాణా షాపింగ్ ఎక్కువగా జరుగుతోంది.  శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి. 

యువత ఈ సమయంలో ఆహారం, వినోదం కోసం ఖర్చు చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ యూపీఐ పెరుగుదల కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. టైర్ 2, టైర్ 4 నగరాల వాటా ఇప్పుడు మొత్తం 41 శాతానికి పైగా ఉంది.  అప్పుల కోసం ఎక్కువ మంది యువతీ యువకులు ఫిక్స్​డ్ ​ డిపాజిట్​ఆధారిత సెక్యూర్డ్ కార్డులను వాడుతున్నారని సూపర్​మనీ రిపోర్ట్​ వివరించింది.