
హైదరాబాద్: లింగంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది. సోమవారం ఉదయం కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ యువతి కాలు జారీ పట్టాల మీద పడి మృతి చెందింది. విజయవాడలో చదువుకుంటున్న పుష్పిత షా(20) ఈ ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి ఎక్స్ ప్రెస్ లో వెళ్లాల్సి ఉండగా.. రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ట్రైన్ కింద పడి మృతి చెందింది. డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కి తరలించారు.