యంగ్ హీరో శర్వానంద్కు సర్జరీ.. అసలేం జరిగింది?

యంగ్ హీరో శర్వానంద్కు సర్జరీ.. అసలేం జరిగింది?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand)కు కొన్ని నెలల క్రితం రోడ్ ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన జరిగిన గాయాలు అన్నీ మానిపోయినప్పటికే.. కాలుకు తలిగిన గాయం ఇప్పటికి కాస్త ఇబ్బంది పెడుతోందట. అందుకే వాటికి సర్జరీ చేయించుకోనున్నాడట శర్వా. ఈ సర్జరీ కోసం శర్వానంద్ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇక సర్జరీ కోసం శర్వానంద్ అమెరికాకు వెళ్లిన విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శర్వా తొందరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య(Sriram adithya)తో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది. శ్రీనివాస చిత్తూరు(Srinivasa chitturu) నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ హేశం అబ్దుల్ వాహాబ్(Hesham abdul wahab) సంగీతం అందుతున్నాడు. మృణాల్ ఠాకూర్(Mruna thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది సమ్మర్ కు గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.