అరవడం ఆపుతారా? వైరలవుతున్న విశ్వక్ ట్వీట్

అరవడం ఆపుతారా? వైరలవుతున్న విశ్వక్ ట్వీట్

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఓపక్క సితారా ఎంటెర్టైమెంట్(Sithara entertainments) లో సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. రీసెంట్ గా ఎస్ఆర్టీ(SRT Entertainments) ఎంటెర్టైమెంట్స్ లో మరో సినిమాను మొదలుపెట్టేశారు. అయితే సినిమాలతో బిజీగా ఉంటూనే.. వివాదాలకు కూడా కేరాఫ్ గా మారుతున్నారు విశ్వక్ సేన్. తాజాగా ఈ హీరో పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అదేంటంటే.. ట్విట్టర్ లో విశ్వక్ సేన్ ముందుగా స్మైలీ ఎమోజీ ట్వీట్ చేశారు. అది చూసి చాలా మందికి అసలు విషయం ఏంటనేది అర్థంకాలేదు. ఆ తరువాత కాసేపటికి మరో ట్వీట్ పెట్టిన విశ్వక్.. నో అంటే నో! ఇది మన మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి కాస్త అరవడం ఆపండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయతించండి. మనం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం. దాన్ని అలాగే ఉంచుదాం. జెస్ట్ రిలాక్స్ అని రాసుకొచ్చారు. 

ఈ ట్వీట్‌ చూశాక నెటిజన్లు మరింత కన్ఫ్యూజన్ లో పడిపోయారు. విశ్వక్ ఎవరిగురించి ఈ పోస్ట్ చేసుంటారు అను తలబద్దలు కొట్టుకున్నారు. కొంతమంది ఈ పోస్ట్ బేబీ(Baby) సినిమా దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) గురించి పెట్టారని కామెంట్స్ చేస్తన్నారు. ఇటీవల సాయి రాజేష్ బేబీ సినిమా గురించి మాట్లాడుతూ.. బేబీ సినిమా కథను ముందు ఒక హీరోకి చెప్పడానికి ప్రయత్నించాను. కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశారు ఆ హీరో. ఆరోజు భాదతో నిద్రకూడా పట్టలేదు అని చెప్పుకొచ్చారు సాయి రాజేష్. 

దీంతో సాయి రాజేష్ బేబీ సినిమా కథ చెప్పింది విశ్వక్ కే నని, అందుకే విశ్వక్ అలా ట్వీట్ చేశారని అనుకుంటున్నారు. ఇక మరికొందరేమో బేబీ సినిమాను రిజెక్ట్ చేసి మంచిపని చేశారు విశ్వక్ భయ్యా.. అది నీకు సెట్ అయ్యే పాయింట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజాంగా విశ్వక్ చేసిన ట్వీట్ సాయి రాజేష్ గురించేనా? అనేది తెలియాలంటే.. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

"No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️

— VishwakSen (@VishwakSenActor) July 20, 2023