ఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘటన

ఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘటన

తొర్రూరు, వెలుగు: సెల్‌‌‌‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడ్డ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కమటం సాయి(21) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతని స్మార్ట్‌‌‌‌ఫోన్ కిందపడటంతో పగిలిపోయింది. దీంతో కొత్త ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు.