
మెహిదీపట్నం, వెలుగు: ఆన్లైన్ ఫ్రెండ్ షిప్చేసిన ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతుండగా మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్ హౌస్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన శివశంకర్ నాయక్ (24) ప్రైవేటు ఎంప్లాయ్. కొంతకాలంగా అతడు ఓ యువతితో ఆన్లైన్లో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు అతడు పంపించిన ఫొటోలు, వీడియోతో డబ్బులు డిమాండ్ చేస్తూ ఇయ్యకుంటే సోషల్‌మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్చేస్తోంది. దీంతో పరువు పోతుందని తీవ్రమనస్తాపంతో అతడు గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకు సూసైడ్‌కు వీడియో కాల్ లో మాట్లాడిన యువతినే కారణమని ఆరోపిస్తున్నారు. లంగర్‌హౌస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.