ఆన్​లైన్​ గేమ్​లో  రూ.12లక్షలు పోగొట్టుకుని.. యువకుడి సూసైడ్​

ఆన్​లైన్​ గేమ్​లో  రూ.12లక్షలు పోగొట్టుకుని..  యువకుడి సూసైడ్​

కంది, వెలుగు :  ఆన్​లైన్ ఇన్​స్టాగ్రామ్​ యాప్​లో  మోసపోయి  ఓ యువకుడు గురువారం ఉరేసుకున్నాడు.  సంగారెడ్డి రూరల్​ ఎస్సై శ్రీనివాస్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  మెదక్​ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామానికి  చెందిన దేవిదాస్,  నాగమణి దంపతులు  సంగారెడ్డి టౌన్​​ పోతిరెడ్డిపల్లి ఆర్​టీసీ కాలనీలో  ఉంటున్నారు.  వీరి కొడుకు అరవింద్​(31) బుధవారం ఆన్​లైన్​ గేమ్​ ఇన్​స్టాగ్రామ్​లో  రూ.12,53,562 పోగొట్టుకున్నాడు.   ఆన్​లైన్ గేమ్​లో  డబ్బులు కట్టించుకున్న వ్యక్తులు అరవింద్​ ఐడీని బ్లాక్ చేశారని,  దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి ఆవేదన చెందాడు.  తన బెడ్​రూంలో చీరతో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు.  మృతుడి తండ్రి దేవిదాస్​  ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.