సీఐ పెట్రోలింగ్ వాహనంతో పారిపోయిన తాగుబోతు

సీఐ పెట్రోలింగ్ వాహనంతో పారిపోయిన తాగుబోతు

అర్థరాత్రి రోడ్డు మీద మద్యం తాగుతున్న వారిని విచారిస్తుండగా.. వారిలో ఒకడు సీఐ వాహనంతో ఉడాయించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఈదులగూడా వద్ద గురువారం అర్థరాత్రి నలుగురు యువకులు రోడ్డు మీద మద్యం తాగుతున్నారు. అటుగా పెట్రోలింగ్ కోసం వెళ్లిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు వారిని గమనించాడు. దాంతో వారి వద్దకు వెళ్లి విచారిస్తుండగా.. నలుగురిలో ఒక యువకుడు పోలీసుల కళ్లుగప్పి పెట్రోలింగ్ వాహనం‌తో కోదాడ వైపు పారిపోయాడు. వెంటనే పోలీసులు రూరల్ ఎస్ఐ పరమేష్‌కి సమాచారమిచ్చారు. దాంతో ఎస్ఐ పరమేష్ తన బృందంతో పారిపోయిన యువకుడిని వెంబడించడంతో.. కంగారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వెహికల్ ముందు భాగం ధ్వంసం అయింది. పోలీసులు చేజ్ చేసి ఆలగడప టోల్ గేట్ వద్ద వాహనాన్ని పట్టుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు

నాకు కరోనా రాలేదు.. కిట్ లోపం వల్లే పాజిటివ్