రైల్వే స్టేషన్లో జిమ్నాస్టిక్ విన్యాసాలు..షాకిచ్చిన పోలీసులు

రైల్వే స్టేషన్లో జిమ్నాస్టిక్ విన్యాసాలు..షాకిచ్చిన పోలీసులు

రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు.  విన్యాసాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. జిమ్మాస్టిక్స్ విన్యాసాలతో ఔరా అనిపించాడు. యువకుడి ప్రదర్శనపై ప్రయాణికులు ఆనందం..ఆశ్చర్యపోగా..రైల్వే పోలీసులు మాత్రం అతనికి షాకిచ్చారు. 

విన్యాసాలు అదుర్స్..

బిహార్‌లోని మాన్‌పుర్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్ లో ఓ ప్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు మొదలుపెట్టాడు. హైజంపులు, ఇతర విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. రైల్లోని ప్రయాణికులంతా ఆశ్చర్యపోయి యువకుడి విన్యాసాలను చూడటం ప్రారంభించారు. ఈ వీడియో వైరల్ అయింది. 

యువకుడికి షాక్..

జిమ్నాస్టిక్స్ విన్యాసాలతో అదరగొట్టిన యువకుడికి రైల్వే పోలీసులు షాకిచ్చారు.  స్టేషన్‌లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.  కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకిస్తుండగా..మరికొంత మంది యువకుడి అరెస్టు చేయడం సరైంది కాదంటున్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.