కేరళ యువకుడి టాలెంట్​..మారుతి 800 కారును రోల్స్​రాయిస్​లా మార్చాడు

కేరళ యువకుడి టాలెంట్​..మారుతి 800 కారును రోల్స్​రాయిస్​లా మార్చాడు

త్రివేండ్రం: కేరళలోని ఓ యువకుడు మారుతీ 800 కారును రూ.45 వేలు ఖర్చు చేసి దాన్ని అత్యంత ఖరీదైన రోల్స్​రాయిస్​ కారులా మార్చాడు. కేరళకు చెందిన18 ఏండ్ల హదీఫ్ అనే యువకుడికి లగ్జరీ, ఖరీదైన కార్లు అంటే ఆసక్తి. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా ఎందుకు మార్చకూడదని అనుకున్నాడు. 

కొన్ని నెలలపాటు శ్రమించి రూ.45 వేలు ఖర్చు చేసి మారుతీ 800 కారును రోల్స్​రాయిస్​ లాంటి కారులా మార్చారు. కొత్తగా ఆవిష్కరించిన ఆ కారుకు ఉన్న అద్దాలు, చక్రాలు, హెడ్‌‌లైట్స్‌‌ సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు. తానే స్వయంగా లోగో తయారుచేసి కారు ముందు భాగంలో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌‌గా మారింది.