నా కుక్కలనే గుద్దుతావా?..పోలీసులపై యువకుడి బూతులు

నా కుక్కలనే గుద్దుతావా?..పోలీసులపై యువకుడి బూతులు

హైదరాబాద్ నారాయణగూడలో నడీ రోడ్డపై  ఓయువకుడు రెచ్చిపోయాడు.   తన కుక్కలనే ఢీ కొడుతారా అంటూ  పోలీసులను బూతులు తిట్టాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు  పెట్రోలింగ్ కార్ నెంబర్ -2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ కాస్తున్నారు.  అదే టైంలో ప్రణయ్ అనే  యువకుడు తన పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.  కుక్కలకు పెట్రోలింగ్ కారు అడ్డుగా రావడంతో కుక్కలను ఢీకొట్టారంటూ ప్రణయ్ ఆగ్రహంతో పోలీసులను ఇష్టానుసారం దూషించాడని స్థానికులు తెలిపారు. కాసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.