బేగంపేటలో యువకుడి దారుణ హత్య

బేగంపేటలో యువకుడి దారుణ హత్య

సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు రౌడీ షీటర్లు. బేగంపేట పాటిగడ్డలో ఉస్మాన్ అనే యువకుడిని బయటికి పిలిచి హత్య చేశారు స్నేహితులు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే మర్డర్ కు కారణమని భావిస్తున్నారు. ఆరుగురు నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.