స్వీట్లు ప్యాక్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి

స్వీట్లు ప్యాక్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి

తోటి పనివారితో కలిసి స్వీట్లు ప్యాక్ చేస్తున్నాడు ఆ యువకుడు. సరదాగానే అందరితో మాట్లాడుతూ తనపని తాను చేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చొన్నోడు..కూర్చున్నట్టుగా వెనక్కి పడిపోయాడు. పడ్డోడు తిరిగి లేవలేదు. పడటంతోనే తుదిశ్వాస విడిచాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ షాపులో పనిచేస్తున్న యువకుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన సంచలనం రేపింది. ఆగ్రాలోని కమ్లానగర్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. మృతిచెందిన యువకుడిని 25 యేళ్ల జస్వీర్ అలియాస్ వీరూ గా గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీరూ హఠాన్మరణంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరోగ్యం ఉన్న వ్యక్తం ఒక్కసారిగా ఇలా కుప్పకూలి ఎలా ప్రాణాలో పోగొట్టుకున్నాడో అర్థం కాక లబోదిబోమంటున్నారు. గుండెపోటుతో వీరూ మరణించి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ .. పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. 

ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలీ తో గుండె జబ్బులు ఎక్కువవుతన్నాయి. చిన్న వయసులోనే  సడెన్ హార్ట్ ఎటాక్  ఆందోళన కలిగిస్తోంది. చిన్న పిల్లలు, యువకులు, నడి వయస్కులు ఇలా  వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చనిపోతున్నారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడమేంటని ఆశ్చర్యం కలుగుతుంది. 

తోటి పనివారితో కలిసి స్వీట్లు ప్యాక్ చేస్తున్నాడు ఆ యువకుడు. సరదాగానే అందరితో మాట్లాడుతూ తనపని తాను చేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చొన్నోడు..కూర్చున్నట్టుగా వెనక్కి పడిపోయాడు. పడ్డోడు తిరిగి లేవలేదు. పడటంతోనే తుదిశ్వాస విడిచాడు.