
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని గొంతు కోశాడు ఓ యువకుడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థిని అక్కకక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో శనివారం జరిగింది. వరలక్ష్మీ అనే విద్యార్థినిని అఖిల్ అనే యువకుడు సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అడ్డగించి గొంతుకోశాడు. వరలక్ష్మీకి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దాడికి పాల్పడ్డ అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వరలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.