ఎవరీ హర్షవర్ధన్? ఏకంగా ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు

ఎవరీ హర్షవర్ధన్? ఏకంగా ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు

స్టార్ హీరోల సినిమాలంటే ఎలా ఉండాలి.. భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, హాయ్ పైడ్ టెక్నీషియన్స్.. ఇలా చాలా పెద్ద లిస్టు ఉంటుంది. అందులోను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా అంటే ఆ లిస్ట్ ఏ రేంజ్ లో ఉండాలి. మరి అలాంటి ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్(Harshavardhan) ను పెట్టుకోవడం ఏంటి? అది కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) సినిమాకు. ఈ న్యూస్ తెలిసినప్పటినుండి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 

హర్షవర్ధన్.. పూర్తి పేరు హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar). ఈమధ్య టాలీవుడ్ లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ అందించడంలో మనోడు చాలా ఫేమస్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సాక్షం(Sakshyam), రవితేజ రీసెంట్ మూవీ రావణాసుర(Ravanasura), నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ(Keshava) వంటి చాలా సినిమాలకు అంద్భుతమైన సంగీతాన్ని అందించారు హర్షవర్ధన్. 

ఇక ఆయన బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ అందించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే అర్జున్ రెడ్డి(Arjun reddy) అని చెప్పాలి. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎంట్రీ కి ఇచ్చిన బీజీఎం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆ మ్యూజిక్ ట్రేండింగ్ లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సినిమా సక్సెస్ లో హర్షవర్ధన్ పాత్ర చాల ఎక్కువ.

ఆ కారణంగానే ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్(Spirit) సినిమా కోసం హర్షవర్ధన్ ను సెలెక్ట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి హర్షవర్షన్ తన పేరుతో ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. తన అద్భుతమైన టాలెంట్ తో ఇప్పటికే చాలా మంది మనసులు గెలుచుకున్నారు. హర్షవర్ధన్ వర్క్ గురించి తెలిసిన చాలా మంది ప్రభాస్ సినిమా కోసం అతన్ని తీసుకోవడంలో తప్పులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ అండ్ సందీప్ సినిమాతో హర్షవర్ధన్ కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.