మ్యూజిక్లో సెంచరీ అంటే.. ఇది మామూలు మ్యాజిక్ కాదు గురు

మ్యూజిక్లో సెంచరీ అంటే.. ఇది మామూలు మ్యాజిక్ కాదు గురు

చిన్న వయస్సులోనే మ్యూజిక్ సంచలనంగా నిలిచిన యువ సంగీత కెరటం జీవి ప్రకాష్ కుమార్(Gv Prakash Kumar). ఈ పేరు ఇప్పుడు భాషలు తేడాలు లేకుండా.. రాష్ట్రాల సరిహద్దులు దాటి వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ ఛాయిస్ గా జీవి ప్రకాష్ నిలుస్తున్నాడు.

ఇతను కేవలం సంగీత దర్శకుడే కాదు..సింగర్, యాక్టర్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్.. సినిమా విభాగంలో ముల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోక తప్పదు. ఇతను ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చిన..తెలుగులో చేసిన మూవీస్ కి గుర్తిండి పోయేలా సాంగ్స్ ఇచ్చాడు. 

ఒకప్పుడు సీనియర్ హీరోలు వందల కొద్ది సినిమా లు చేసి గుర్తింపు పొందిన వారున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏ హీరో అయిన ఇప్పుడు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసే పరిస్థితి వచ్చింది. అలా ఇప్పుడున్న  హీరోలు కెరీర్‌ మొత్తం లో పాతిక సినిమా లు చేస్తే గొప్ప విషయం.

ఇక టెక్నిషియన్స్ లో అయిన..ఎవ్వరు పాతిక సినిమాల కంటే ఎక్కువ కాలం రాణించలేని పరిస్థితి ఉంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్..చిన్నతనంలోనే తన స్పీడ్‌ తో అరుదైన మైలు రాయిని అందుకోబోతున్నాడు. 2015లో వ‌చ్చిన‌ విజ‌య్ సినిమా తెరి జీవి ప్రకాష్ 50వ చిత్రం.కాగా..ఇంత‌లోనే ఇప్పుడు వంద సినిమాల మైలురాయిని అందుకుంటున్నాడు. 

డైరెక్టర్ సుధ కొంగర డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) తో ఓ మల్టీస్టారర్ మూవీ తీయడానికి సిద్ధమయ్యింది. ఈ మల్టీస్టారర్లో  హీరో సూర్యతో పాటు..మలయాళ సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు  జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సూర్య ప్రకటించడంతో పాటు, అతడికి  ఇది వందవ సినిమా కావడం ఎంతో ఆనందించదగ్గ విషయం అన్నట్లు సూర్య పోస్ట్ చేశాడు.

జీవి ప్రకాష్ తన 19 ఏళ్ళ వయస్సులో సినీ ఎంట్రీ ఇవ్వగా..20 ఏళ్ళ వయస్సులోనే సూపర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ అందించిన ఘనతను సాధించాడు. ప్రస్తుతం జీవి ప్రకాష్ వయస్సు 36 సంవత్సరాలు కాగా..ఇంత చిన్న వయస్సులోనే 100 సినిమాలు అంటే..ఇది మామూలు విషయం కాదు గురు అంటూ..సోషల్ మీడియాలో మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

జీవి ప్రకాష్ తెలుగులో డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఒంగోలు గిత్త,  టైగర్ నాగేశ్వరరావు, ఆదికేశవ వంటి మూవీస్ తో ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక త్వరలో ధనుష్ తో కెప్టెన్ మిల్లర్, విక్రమ్ తంగలాన్, కార్తి జపాన్, SK21, సూర్య 43 వంటి మూవీస్ తో బిజీగా ఉన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. జీవి ప్రకాష్ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు.

జీవి ప్రకాష్ ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయగా.. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసి మెళుకువలు నేర్చుకున్నాడు. ఇపుడు   పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రెబెల్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 

  • Beta
Beta feature