హాలియా, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి చెందిన యువకుడు సజ్జల మురళీధర్ రెడ్డి అనే యువకుడు అమెరికా నుంచి సొంత గ్రామానికి వచ్చాడు.
అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న మురళీధర్ రెడ్డి ఓటు వేసేందుకు గాను ఖండాలను దాటి అమెరికా నుంచి తన సొంతూరుకు వచ్చాడు. సొంతూరిలో ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల గ్రామస్తులు,స్నేహితులు మురళీధర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన పుట్టిన ఊరు, ఐన వాళ్లను ఎప్పటికి మరిచిపోలేమన్నారు.
