సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి రూమ్ కు వెళ్లింది ఓ యువతి. అదే సమయానికి ఆమె తండ్రి ఎంటర్ కావడంతో తప్పించుకునే క్రమంలో ప్రాణాలు విడిచింది యువతి. 8వ అంతస్తులో ఉన్న ఆ యువతి పక్క బిల్డింగ్ పైకి వెళ్తుండగా కిందపడి తీవ్ర గాయాలై చనిపోయింది.
అసలేం జరిగిందంటే..?.
ప్రియురాలు సకినా ఫాతిమా, ప్రియుడు హుస్సేన్ ఇద్దరు సంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఒకరికొకరు పరిచయస్తులు. ఇద్దరు గత రాత్రి తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 40 8 వ అంతస్తులోని డబుల్ బెడ్రూమ్ కు వెళ్లారు.ఫాతిమా, హుస్సేన్ అలీ ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్న సమయంలో ఫాతిమా తండ్రి వచ్చి తలుపు తట్టారు. తండ్రి గొంతు విన్న ఫాతిమా తండ్రికి దొరికిపోతాననే భయంతో హుస్సేన్ అలీ సహకారంతో బాల్కనీ గుండా పక్క ఫ్లాట్లకు వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఫాతిమా.
ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కొల్లూరు పోలీసులు. ప్రియుడు అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
