మందు గ్లాస్ కోసం అన్న హత్య .. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి తోసేసిన తమ్ముడు

మందు గ్లాస్ కోసం అన్న హత్య .. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి తోసేసిన తమ్ముడు

నాచారం, వెలుగు: నాచారంలో దారుణం జరిగింది. మందు గ్లాస్​ కోసం అన్నను తమ్ముడు హత్య చేశాడు. నాచారంలో నివసిస్తున్న స్టాఫర్డ్ రోహన్ సేయర్స్(30) అతని స్టెప్ బ్రదర్ లియోనార్డ్ ఏంజెలో సేయర్స్(28) కలిసి సంక్రాంతి రోజు అర్ధరాత్రి సమయంలో తాము నివాసం ఉంటున్న మూడంతస్తుల భవనం టెర్రస్‌‌పై మద్యం తాగారు. ఈ క్రమంలో గ్లాస్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 గొడవ ఉధృతమవడంతో తమ్ముడు లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ తన అన్న స్టాఫర్డ్ రోహన్ సేయర్స్​ను బలవంతంగా టెర్రస్​పై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

తల్లి మిచెల్ రోసారియో ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి ఐదు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.