బిడ్డతో ఆఫీసుకు మేయర్ ..ఫొటో వైరల్

బిడ్డతో ఆఫీసుకు మేయర్ ..ఫొటో  వైరల్

21 ఏళ్లకే  తిరువనంతపురం మేయర్ గా బాధ్యతలు చేపట్టి  రికార్డు స్పష్టించిన ఆర్య రాజేంద్రన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. నెల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తన పాపను ఒడిలో కూర్చోబెట్టుకుని విధులకు హాజరైంది. 

ఫైళ్లపై సంతకం చేస్తు్న్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆర్య రాజేంద్రన్‌ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. అతను కూడా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. 

ప్రసవం జరిగిన నెల దాటక ఆర్య రాజేంద్రన్‌ తన పాపను ఎత్తుకొని కార్యాలయానికి వెళ్లింది. వృత్తి, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ సునాయాసంగా నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు ఆర్య రాజేంద్రన్‌ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు కొనియాడారు. 

ఈ ఫొటోపై అభినందనలతో పాటుగా ట్రోల్స్ కూడా వస్తు్న్నాయి.  ఆర్య రాజేంద్రన్‌ ఫొటో కోసమే అలా చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.