
- విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారా? స్త్రీ శిశు శక్తి కింద మహిళలకు స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పగించినందుకా..”అని ఆయన ప్రశ్నించారు.
సబితా రెడ్డిని అక్క అని గౌరవంగా అనడం తప్పా అని నిలదీశారు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ మారి మంత్రి పదవులు అనుభవించారని అన్నారే తప్ప మరోలా కాదన్నారు.