- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని డబ్బును అర్హులు క్లెయిమ్చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈ నెల 20న కలెక్టరేట్లో ‘మీ డబ్బు మీ హక్కు’ అనే అంశంపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్యాంకుల్లో పొదుపు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్స్, బీమాలు క్లెయిమ్ చేసుకునేందుకు ఈ శిబిరం ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. పదేండ్ల పైబడి బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని నిల్వ వివరాలు ఆర్బీఐ ఉద్గం వెబ్ సైట్ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులకు బ్యాంకుల్లోనే డబ్బులు పొందేందుకు ఆకాశం కల్పిస్తున్నామని, అర్హులు వినియోగించుకోవాలని కలె క్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
