సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సేనారెడ్డితో పాటు... పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని గోశామహాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. చెన్నూరులో నిరుద్యోగి మహేశ్ ది ప్రభుత్వ హత్యేనన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సేనారెడ్డి. నోటిఫికేషన్లు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు శివ సేనారెడ్డి.