
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ..నిరుద్యోగి ముత్యాల సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ముత్యాల సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..పైళ్ల శేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకుని యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.